![]() |
![]() |
.webp)
జయమ్ము నిశ్చయమ్ము రా సెలబ్రిటీ టాక్ షో ప్రతీ వారం ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగుతోంది. ఇక ఈ వారం షోకి మహానటి కీర్తి సురేష్ వచ్చింది. ఇక ఆమె నవ్వు ఆమె లైఫ్ గురించి మొత్తం ఈ షోలో చెప్పుకొచ్చింది. ఐతే ఈమె పోలీసు స్టేషన్ కి వెళ్ళింది ఒకసారి. దాంతో జగపతి బాబు ఈ పోలీసు స్టేషన్ కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అని అడిగేసరికి..అసలు విషయం బయటపెట్టింది. "కాలేజీ టైములో నాకు ఒక ఫ్రెండ్ ఉంది. ఒక సలోన్ కి మేము వెళ్తున్న టైములో ఒక చోట నిలబడి ఎం చేయాలి అని చూస్తున్న టైములో ఒక అబ్బాయి వచ్చి మేము రోడ్ క్రాస్ చేసే టైములో భుజాన్ని టచ్ చేసాడు. దాంతో నేను వాడిని పట్టుకుని వెంటనే లాగే ఒక్కటి ఇచ్చాను.
దాంతో అతను సీరియస్ గా ఫేసు పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రోడ్ క్రాస్ చేస్తున్న టైములో బ్యాక్ నుంచి ఏదో యాక్సిడెంట్ జరిగిందేమో అన్నట్టుగా అనిపించింది నాకు ఏంటంటే అతను వెనక నుంచి వచ్చి నెత్తి మీద చాలా గట్టిగ కొట్టి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. నేను నా ఫ్రెండ్ వెంటనే వాడి వెనక పరిగెట్టాం. ఛేజ్ చేసాం చాలా దూరం పరిగెత్తిన అతను దొరకలేదు. ఐతే అక్కడ ఒక బేకరీలో కూర్చున్నాం. నాన్నకు ఫోన్ చేశా..దగ్గరలో వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారేమో చూస్తాను అన్నారు. ఇంతలో నేను రోడ్డుకు అవతల వైపు నన్ను కొట్టిన వాడిని చూసా. వెంటనే పరిగెత్తుకుని వెళ్ళా. కొంచెం దూరంలోనే ఒక పోలీస్ బూత్ కూడా ఉంది. నేను నా ఫ్రెండ్ వెళ్లి అతన్ని పట్టుకుని కంప్లైంట్ ఇచ్చా పోలీస్ స్టేషన్ లో. " అలా పోలీసు స్టేషన్ కి వెళ్లాల్సి వచ్చింది అంటూ చెప్పింది కీర్తి సురేష్.
![]() |
![]() |